Thursday, February 25, 2016

అమరకోశము శబ్దాది వర్గము

అమరకోశము  శబ్దాది వర్గము

శబ్దే నినాద నినద ధ్వని ధ్వాన రవ స్వనాః
స్వాన నిర్ఘోష నిర్ర్హాద నాద నిస్వాన నిస్వనాః
ఆర వారావ సంరావ  విరావాః

నినాదః, నినదః = మ్రోయునది నినాదము
ధ్వనిః, ద్వానః = ధ్వనించునది
రవః, స్వనః = రవము చేయునది
నిర్ఘోషః, నిర్ర్హాదః = అవ్యక్త శబ్దములు
నాదః = నదించునది
నిస్వాదః, నిస్వనాః = స్వన శబ్దము
రవః, ఆరావః, సంరావః, విరావః = రవమగు శబ్దములు
ఇవి పదిహేడున్ను మ్రోతకు పేర్లు

అథః మర్మరః

మర్మరః = మరమరమను శబ్దము కలుగును
కోకలు, ఆకులు మొదలగు వాని మ్రోత పేరు

భూషణానాం తు శిఞ్జితమ్

శిఞ్జితం = అస్ఫుతముగా మ్రోయునది
ఇది భూషణముల ధ్వనికి పేరు

నిక్వాణో నిక్వణః క్వాణః క్వణః క్వణన మిత్యపి

నిక్వాణః, నిక్వణః, క్వాణః, క్వణః, క్వణః =లెస్సగా పలుకునది
ఇవి ఐదున్ను వీణాది సకల వాద్యముల ధ్వనులకు పేర్లు

వీణాయాః క్వణితే ప్రాదేః ప్రక్వాణ ప్రక్వణాదయః

ప్రక్వాణః, ప్రక్వణః = మిక్కిలి మ్రోయునది
ఇవి రెండున్ను వీణాది ధ్వని పేర్లు

కోలాహలః కలకలః

కోలాహలః = కోలములు, వరాహములు వీటిని భయపరచునది
కలకలః = అవ్యక్తముగా పలుమారులు పలుకబడునవి
ఇవి రెండున్ను గుంపున పుట్టిన గొప్ప ధ్వనికి పేర్లు

తిరశ్చాం వాశితం రుతం

వాశితం = పలుకబడునది
రుతం = పలుకబడునది
ఇవి రెండున్ను మృగ పక్ష్యాదుల ధ్వనికి పేర్లు

స్త్రీ ప్రతిశ్రు త్ప్రతిద్వానే

ప్రతిశ్రుతిః = ఎదురుగా వినబడునది
ప్రతిద్వానః = ఎదురుగా పలుకుట
ఇవి రెండున్ను ప్రతిధ్వని పేర్లు

గీతం గాన మిమే సమే

గీతం , గానం = పాదబడునది
ఇవి రెండు పాట పేర్లు
ఇవి రెండునూ సమానార్ధకములు


శబ్దాది వర్గము సమాప్తము  తరువాత నాట్య వర్గము           

No comments:

Post a Comment