ధీవర్గము
బుద్ది
మనీషా ధిషణా ధీః ప్రజ్ఞా శేముషీ మతిః
ప్రే
క్షోపలబ్ధి శ్చిత్సంవిత్ ప్రతిపజ్ఞప్తి చేతనాః
బుధ్ధిః
= దీనిచేత నెరుగ బడును
మనీషా
= అన్నిటిని తెలిసికొనునది
ధిషణాః
= దీనిచేత ప్రగల్భులగుదురు
ధీః
= దీనిచేత ధ్యానము చేయుదురు
ప్రజ్ఞా
= దీనిచేత లెస్సగా నెరుగబడును
శేముషీ
= మోహమును పోగొట్టునది
మతిః
= దీనిచేత నెరుగబడును
ప్రేక్షాః
= దీనిచేత లెస్సగా చూతురు
ఉపలబ్ధిః
= పదార్ధము దీనిచేత లెస్సగా పొందబడును
చిత్
= దీనిచేత జ్ఞానయుక్తులగుదురు
సంవిత్
= దీనిచేత లెస్సగా నెరుగుడురు
ప్రతిపత్
= పదార్ధము దీనిచేత నెరుగబడును
జ్ఞప్తిః
= దీనిచేత సర్వము నెరుగబడును
చేతనాః
= దీనిచేత జ్ఞానయుక్తులగుదురు
ఇవి
పడునాలుగును బుద్ధి పేర్లు
ధీ
ర్దారణావతీ మేధా
అనుభూతమైనవన్నియు
దీనియందు సంగతమై యుండును
ఇది
ధారణా శక్తి కలిగిన బుద్ధి పేరు
సంకల్పః
కర్మ మానసం
సంకల్పః
= దీనిచేతలెస్సగా కల్పించబడును
ఇది
మనోవ్యాపారము పేరు
చిత్తా
భోగో మనస్కారః
చిత్తాభోగః
= మనస్సుయొక్క పరిపూర్ణత్వము
మనస్కారః
= మనస్సుయొక్క నిశ్చయము
ఇవి
మనస్సునకు గల సుఖాదుల యందైన నిబ్బరము పేర్లు
చర్చా
సంఖ్యా విచారణా
చర్చా
= దీని చేత విచారించబడును
సంఖ్యా
= దీనిచేత లెస్సగా చెప్పబడును
విచారాణా
= దీనిచేత సందేహ రహితులగుదురు
ఇవి
మూడు విచారణ పేర్లు
అధ్యాహార
తర్క ఊహో
అధ్యాహార
= లేని దానిని ఊహించి తెలియుట
తర్కః
= దీనిచేత సంశయభ్రాంతి జ్ఞానాదులను తరింతురు
ఊహో
= దీనిచేత ఊహింపబడును
ఇవి
మూడు ఊహ పేర్లు
విచ్చికిత్సాతు
సంశయః
సందేహ
ద్వాపరౌ చ
విచికిత్సా
= సందేహ నిశ్చయములు రెంటియందును నివశించునది
సంశయః
= ఉభయ కోటి యందు నుండునది
సందేహః
= రెండు అర్ధములయందు సంబంధించియుండునది
ద్వాపరః
= స్థాణువో పురుషుడో అనెడి రెండు పక్షములును దీనియందు ప్రధానములై యుండును
ఈ
నాలుగును ఒక వస్తునిర్ణయము నందు పలుశంకలు కలుగుటకు పేర్లు
అథ
సమౌ నిశ్చయ నిర్ణయం
నిర్ణయః
= మిక్కిలి బుద్ది నొక దరిని పొందించునది
నిశ్చయః
= బుధ్ధినీ చెదరకుండునట్లు కూర్చునది
ఈ
రెండును నిశ్చయము పేర్లు
మిథ్యా
దృష్టి ర్నాస్తికతా
మిథ్యా
దృష్టి = ఇహలోకమే కానీ పరలోకము లేదనెడి దృష్టి
నాస్తికతః
= పరలోకము లేదనెడి వాడి భావము నాస్తికత
ఇవి రెండునుపరలోకము లేదు అను బుద్ధికి పేర్లు
వ్యాపాదో ద్రోహ చిన్తనమ్
వ్యాపాదః
= దీని చేత విశేషముగా నాపాదించబడును
ద్రోహ
చిన్తనం = ద్రోహము యొక్క వెదకుట
ఇవి
రెండును ఒరులకు కీడు చేయుటకు పేర్లు
సమో
సిద్ధాంత రాద్దాన్తౌ –
దేనియందేని
నిశ్చయముండుట అను సిద్ధాంతమును సిద్దాంత రాద్దాంతమందురు
భ్రాంతి
ర్మిధ్యా మతిర్భ్రమః
భ్రాంతిః,
భ్రమః = దీని చేత భ్రమింప జేయబడును
మిధ్యా
మతిః = అసత్యమైన బుద్ధి
ఇవి
రెండును ఒకదానిని చూచి మరియొకటి అను తలచుట పేర్లు
సంవి
దాగూః ప్రతిజ్ఞానం నియ మాశ్రవ సంశ్రవాః
అన్గీకా
రాభ్యుపగమ ప్రతిశ్రవ సమాధయః
సంవిత్
= దీని చేత లెస్సగా తెలియబడును
ఆగూః
= ఆగువనగా అంతటా నెరుగుట, దీనిచేత ఉద్యోగము గలుగును
ప్రతిజ్ఞానం
= దీనిచేత ప్రతిజ్ఞ చేయబడును
నియమః
= దీనిచేత నియమింపబడును
ఆశ్రవః
= అవును అని వినుట ఆశ్రవము
సంశ్రవః
= కానిమ్ము అనుట సంశ్రవము
అంగీకారః
= మునుపు ఒప్పుకొనని దానిని ఇప్పుడు ఒప్పుకొనుట
అభ్యుపగమః
= ఎదుటివారు చెప్పిన అర్ధమును తాను కానిమ్మని యెరుగుట.
ప్రతిశ్రవః
= ఎదుటి వారు చెప్పిన అర్ధమును అభిముఖుడై వినుట
సమాధిః
= దీనిచేత లెస్సగా బోషింపబడును
ఇవి
పదిన్ని ఒప్పుకొనుట పేర్లు
మోక్షే
ధీర్జ్ఞానం –
జ్ఞానం
= దీనిచేత ఎరుంగబడును
ఇది
మోక్ష సాధనమైన బుద్ధి పేరు
అన్యత్ర
విజ్ఞానం శిల్ప శాస్త్రయోః
విజ్ఞానం
= నరునికి మోక్షార్ధమైన జ్ఞానమే హితము కనుక తదితర జ్ఞానము విపరీత జ్ఞానము
ఇది
శిల్పాది విషయమైన బుద్ధి పేరు
ముక్తిః
కైవల్య నిర్వాణ శ్రేయో నిశ్శ్రేయసామృతమ్
మోక్షో
ఽ పవర్గః
ముక్తిః
= శరీరేన్ద్రియములవలన ఆత్మా విడువబడుట ముక్తి, ఆత్మను సంసారబంధమునుండి
విడిపించునది ముక్తి
కైవల్యం
= శరీరేంద్రియములతో బాసిన ఆత్మ ద్వితీయమై యుండుట
నిర్వాణం
= దుఃఖాదులు దీనియందు నిర్గతమగును
శ్రేయః
= సేవింపబడునది, మిక్కిలి శ్రేష్ఠమైనది
నిశ్శ్రేయసం
= నిశ్చితమైన శ్రేయస్సు
అమృతం
= మరణము దీనియందు లేదు
మోక్షః
= దుఃఖాదుల వినాశనము మోక్షము, జీవులను పాపము నుండి విడిపించునది
అపవర్గః
= దుఃఖాదులను వర్జించుట
ఇవి
ఎనిమిదిన్ని మోక్షము పేర్లు
అథాజ్ఞాన
మవిద్యాహం మతిః స్త్రియాం
అజ్ఞానం
= జ్ఞానము కానిది అజ్ఞానం
అవిద్యాం
= విపరీత జ్ఞానము అవిద్య
అహంమతిః
= నేననెడు స్వతంత్ర బుద్ధి అహంమతి
ఇవి మూడున్ను అజ్ఞానము పేర్లు
రూపం
శబ్దో గంధ రసస్పర్శాశ్చ విషయా అమీ
గోచరా
ఇన్ద్రియార్ధాశ్చ –
రూపం
= మోహింపజేయునది
శబ్దః
= దీనిచే నాక్రోశించబడును
శబ్దః
= సుఖమునిచ్చునది
గంధః
= దీనిచే పీడించబడును, లేక అభిలషించబడును
రసః
= ఆస్వాదించబడునది
స్పర్శః
= స్పృశింపబడునది
విషయః
= ఇంద్రియములను బంధించునది
గోచరాః
= గోవులనగా ఇంద్రియములు అవి వీనియందు చరించును
ఇంద్రియార్ధాః
= ఇంద్రియముల చేత అభిలషింపబడునవి
ఇవి
విషయముల పేర్లు
హ్రుషీకం
విష ఇంద్రియం
హృశీకం
= దీని చేత సంతోషింతురు
విషయ
= విషయము గలది
ఇంద్రియం
= ఇంద్రుడనగా ఆత్మ ఆత్మకు జ్ఞాపకము గనుక ఇంద్రియము
ఇవి
మూడును యింద్రియముల పేర్లు
కర్మేన్ద్రియం తు పాయ్వాది
పలుకుట, గ్రహించుట, నడచుట, విడచుట, ఆనందించుట అను కర్మలకు సాధనములైన
ఇంద్రియములు
కర్మేంద్రియములు,
అవి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థల పేర్లు
మనోనేత్రాది
ధీన్ద్రియం
జ్ఞానమునకు
నిమిత్తమైన ఇంద్రియములు - మనో, నేత్ర, జిహ్వ,
ఘ్రాణ, త్వక్, శ్చోత్రములు.
తువరస్తు
కషాయో ఽ స్త్రీ
కంఠమునడ్డగించునది
కాని, వెగటు కల్గించునది కాని తువరము. (తూవరమనియు, కువరమనియు కూడా పాఠాంతరము కూడా
కలదు)
కషాయః
= కంఠమును పీడించునది
ఇవి
రెండును వగరుకు పేర్లు
మధురో
మాధుర్యము
కలిగినది మధురము (వాతమును చెరచునది)
ఇది
తీపికి పేరు
లవణః
వాయువును
గాని జాడ్యమును కాని పోగొట్టునది
ఇది
ఉప్పు పేరు
కటుః
కతువనగా
వ్యాపించునది
ఇది
కారమునకు పేరు
తిక్తః
శ్లేష్మమునల్పముగా
చేయునది
ఇది
చేదు పేరు
ఆమ్లశ్చ
రోగమును
జేయునది, రుచి చూచునపుడు సీత్కార శబ్దమును పుట్టించునది
ఇది
పులుపు పేరు
రసాః
పుంసిః
ఇవి
ఆరున్ను రసమును చెప్పునపుడు పుంలింగము
తద్వత్సు
షడమీ త్రిషుః
ఇవి రసవంతమైన వస్తువులను చెప్పునపుడు త్రిలింగములు
విమర్దోత్థే
పరిమళో గంధే జనమనోహరే
పరిమళ
శబ్దము నానా ద్రవ్యముల మెదపుట వలన పుట్టిన జనమనోహరమైన గంధము పేరు. దీనికి ఇంకొక
అర్ధము ధరింపబడునది.
ఇది
పరిమళమునకు పేరు
ఆమోద
స్సో తి నిర్హారీ –
ఆమోదః
= మిక్కిలి దూరముగా వ్యాపించునది, జనులను మిక్కిలి సంతోషింపజేయునది
సమాకర్షీ
తు నిర్హారీ
సమాకర్షీ
= లెస్సగా మనస్సు నాకర్షించుచునది
నిర్హారీ
= మనస్సును మిక్కిలి హరించునది
ఇవి
రెండును మిక్కిలి దూరముగా వ్యాపించు గంధము గలదాని పేర్లు
సురాభిర్ఘ్రాణ
తర్పణః
ఇష్టగన్ధ
స్సుగంది స్స్యాత్
సురభి
= లెస్సగా జనానందమును కలుగ జేయునది
ఘ్రాణ
తర్పణః = నాసిక దీనిచేత తృప్తినొందును
ఇష్ట
గన్ధః = ఇష్టమైన గంధము గలది
సుగంధి
= మంచి గంధము గలది
ఇవి
నాలుగు ఇంపైన వాసన గల వస్తువుల పేర్లు
ఆమోదీ
ముఖ వాసనః
ఆమోదీ
= ఆమోదము గలిగినది
ముఖవాసనః
= ముఖమును పరిమళింపజేయునది
ఇవి
రెండును ముఖ వాసనా ద్రవ్యముల పేర్లు
పూతి
గన్ధిస్తు దుర్గంధో
పూతిగంది
= దుర్గంధము గలిగినది
దుర్గంధీ
= దుష్టమైన వాసన గలిగినది
ఇవి
రెండును దుర్గంధము గల వస్తువుల పేర్లు
విస్రం
స్యా దామ గన్ధి యత్
విస్రం
= పారవేయబడునది
ఆమగంధి
= అపక్వమలము వంటి గంధము గల వస్తువు
ఇవి అపక్వమైన మాంసాదుల గంధము పేర్లు
శుక్ల
శుభ్ర శుచి శ్వేత విశద శ్యేత పాణ్డరాః
అవదాత
స్సితో గౌరో వళక్షో ధవళో ఽ ర్జునః
శుక్లః
= మనస్సు దీనియందు ప్రవర్తించును
శుభ్రః
= ఒప్పునది
శుచిః
= పరిశుద్ధమైనది
శ్వేతః
= వర్ణమును జేయునది, దీనియందు మనస్సు ఉండును మరియు వృద్ధి పొందును
విశదః
= మనస్సునందు ప్రవేశించునది
శ్యేతః
= జనుల మనస్సును పొందునది
పాండరః
= దీని యందు మనస్సు పొందును, స్తోత్రము చేయబడునది
అవధాతః
= శోదించబడునది
సితః
= మనస్సును బంధించునది
గౌరః
= కీర్తన చేయబడునది, మనస్సు దీనియందు ఉద్యమించును
వళక్షః
= దీనియందు చూపు చంచలమై యుండును
ధవళః
= దీనిచేత పదార్ధము శుద్ధి బొందును
అరుణః
= ఆర్జించబడునది
ఇవి
పదమూడున్ను తెలుపు రంగు పేర్లు
హరిణః
పాణ్డురః పాణ్డుః
హరిణః
= మనస్సును హరించునది
పాన్డురః = తెలుపు వన్నె కలిగినది
పాండుః
= మనస్సును పొండునది
ఇవి
మూడును పసుపుతో కూడిన తెలుపు పేర్లు
ఈశ్పాణ్దుస్తు
ధూసరః
ఇది
కురూపమగుట చేత చిత్తమును కంపింపజేయునది
ఇది
బూడిద వర్ణము పేరు
కృష్ణే
నీలాసిత శ్యామ కాల శ్యామల మేచకాః
కృష్ణః
= చిత్తము నాకర్షించునది
నీలః
= వస్తువును నల్లగా చేయునది
అసితః
= సితమనగా తెలుపు అది కానిది అసితము అనగా నలుపు
శ్యామః
= మనస్సును బొండునది
కాలః
= మనస్సును ప్రేరేపించునది,
శ్యామలః
= శ్యామ వర్ణము కలిగినది
మేచకః
= మిశ్రమగునట్టిది
ఇవి
ఏడున్ను నలుపురంగునకు పేర్లు
పీతో
గౌరో హరిద్రాభః
పీతః
= మనస్సును లోగొనునది
గౌరః
= మనస్సు దీనియందు ఉద్యమించును
హరిద్రాభః
= పసుపు వన్నె కలిగినది
ఇవి
మూడు పసుపు వన్నె పేర్లు
పాలాశో
హరితో హరిత్
పాలాశః
= పాలాశామనగా ఆకు దాని వర్ణము కలిగినది
హరితః,
హరిత్ = మనస్సును హరించునది
ఇవి
మూడు ఆకుపచ్చ వన్నె పేర్లు
లోహితో
రోహితో రక్తః
లోహితః,
రోహితః = సంధ్యాది కాలములందు పుట్టునది
రక్తః
= రాగమును పొండునది, సంధ్యా రాగము వంటిది
ఇవి
మూడున్ను ఎరుపురంగు పేర్లు
శోణః
కోకనదఛ్చవిః
శోణః
= వర్ణమును జేయునది
కోకనదః
= రక్తోత్పలము వంటి కాంతి కలది
ఈ
రెండును ఎర్ర కలువ వంటి ఎరుపు పేర్లు
అవ్యక్త
రాగస్త్యరుణః
అరుణః
= మనస్సును పొందు ఈ వర్ణము వ్యక్తము కాని ఎరుపు పేరు
శ్వేత
రక్తస్తు పాటలః
పాటలః
= ఇది తెలుపును ఎరుపును గూడిన వన్నె పేరు (పాటలి యనగా కలిగొట్టు పువ్వు)
శ్యావః
స్యాత్కపిశో
శ్యావః
= వర్ణాంతరమును పొందునది
మర్కటః
= మరకత వర్ణము వంటి వర్ణము కలిగినది
ఈ
రెండు నలుపు, పసుపు కూడిన వన్నె పేర్లు
కడారః
కపిలః పింగ పిశఙ్గా కద్రు పిఙ్గళౌ
కడారః
= బాగుగా తడుపునది
కపిలః
= కపిల వర్ణము నిచ్చునది
పింగః
= పింగా వర్ణము కల్గినది
పిశంగః
= వర్ణాంతరమునొందునది
కద్రుః
= ఒప్పునట్టిది , కుత్సితము నొందునది
పింగళః
= వర్ణమును జేయునది, పింగ వర్ణమునిచ్చునది
ఇవి
ఆరున్ను గోరోచన వన్నె పేర్లు
చిత్రం
కిర్మీర కల్మాష శబలై తాశ్చ కర్బురే
చిత్రం
= దీనియందు అన్ని వర్ణములు కూర్పబడును
కిర్మీరః
= నానా వర్ణములు దీని యందు నెరప బడును
కల్మాషః
= అనేక వర్ణముల నాకర్షించునది
శబలః
= అనేక వర్ణముల బొందునది, నానా వర్ణముల బొందునది
కర్బురః
= దీని యందు నానా వర్ణములు నెరపబడును, అనేక వర్ణములచే చేయబడునది
ఈ
ఐదున్ను నానా వర్ణములు కలిసిన పేర్లు
No comments:
Post a Comment