కాలవర్గము
కాలో దిష్టో ఽ ప్యనేహాపి
సమయో ఽ పి
కాలః = దీని చేత
లెక్కించబడును (కల్యతే సంఖ్యాయతే ఇతి కాలః), ప్రేరేపింపజేయునది (కలయతి ప్రేరయతీతి)
దిష్టః = దీని చేత సుఖ
దుఃఖాదులీయబడుచున్నవి, దీని చేత జనులు వ్యాపార యుక్తులగుదురు
అనేహా = నశించనిది, చేష్ట లేనిది
సమయః = లెస్సగా నెరుగబడునది
ఇవి నాలుగును సామాన్య కాలము
పేర్లు
అధ పక్షతి
ప్రతిపద్ద్వే ఇమే
స్త్రీత్వే
పక్షతి = శుక్ల కృష్ణ
పక్షముల ప్రారంభము
ప్రతిపత్ = దీనివలన
చంద్రుని ఉదయము గాని క్షయము గాని తెలియబడును
ఇవి రెండును పాడ్యమి పేర్లు
తదాద్యో స్థిథయో ద్వయో
తిథి = అరువది గడియలచే
పెంపొందునది
ఘస్రోదినాహనీ వా తు క్లీబే
దివావాసరౌ
ఘస్రః = అంధకారమును
తినివేయునది
దినం = అంధకారమును
ఖండించునది, సూర్యునిచే విడువబడనిది
దివసః = దీనిచే జనులు
ప్రకాశింతురు
వాసర్దః = దీనియందు
వసిన్తురు
వాసరః = లోకమును నిలుపునది
ఇవి ఐదున్ను పగలు పేర్లు
ప్రత్యూషో ఽ హర్ముఖం
కల్యముషః ప్రత్యుషసీ ఆపి
ప్రభాతంచ
ప్రత్యూషః = రాత్రిని
పోగొట్టునది, చీకటిని పోగొట్టునది
అహర్ముఖం = అహస్సు యొక్క
ప్రారంభం
కల్యం = ఇందు జనులు
ప్రబోధింపబడుదురు, శుభమును చేయునది, కాలమందు యోగ్యమైనది
ప్రత్యుషః = సూర్య
కిరణములచేత దహింపజేయునది
ప్రభాతం = ప్రకాశింప
ప్రవర్తించినది
ఇవి ఐదున్ను ప్రాతఃకాలము
పేర్లు
దినాన్తే తు సాయః
దినాన్తః = దినము యొక్క
అవసాన కాలము
సాయః = దినమును అంతము
నొందించునది
ఇవి రెండును దినము యొక్క
కడపటి భాగమందలి మూడు ముహూర్తముల కాలము పేర్లు
సంధ్యా పితృప్రసూః
సంధ్యా = దీనియందు లెస్సగా
ధ్యానము చేయుదురు, అహోరాత్రములచే సంధింపబడునది
పితృప్రసూః = పితృదేవతలఁ
బుట్టించునది
సూర్యాస్తమయ అనంతరము మూడు
ఘడియలు, సూర్యోదయము పూర్వం ఐదు ఘదియలును సంధ్య అని పిలువబడుచున్నవి
ఇవి రెండును సంధ్యా కాలము
ప్రాహ్ణా పరాహ్ణ మధ్యాహ్నా
స్త్రి సంధ్యం
ప్రాహ్ణా = అహస్సు యొక్క
మొదటి భాగం
అపరాహ్ణా = అహస్సు యొక్క
కడపటి భాగము
మధ్యాహ్నా = అహస్సు యొక్క
మధ్య భాగము
త్రిసంధ్యం = మూడు సంధ్యల
ఏకీకరణము త్రిసంధ్య యనబడును
ఈ మూడును మూడు కాలముల
పేర్లు
________________________________________________________
అథ శర్వరీ
నిశా నిశీధినీ తాత్రి
స్త్రియామా క్షణదా క్షపా
విభావరీ తమస్విన్యౌ రజనీ
యామినీ తమీ
శర్వరీ = వ్యాపారమును,
దినమును చెరచునది
నిశా = అన్ని వ్యాపారములను
మిక్కిలి స్వల్పముగా చేయునది
నిశీధినీ = నిశీధమనగా
నడిరేయి. అది దీనియందు గలదు.
రాత్రిః = సుఖమును కలుగ
జేయునది
త్రియామా = యామమనగా జాము ,
మూడు జాములు కలది కనుక త్రియామా అనగా రాత్రి.
క్షణదా = వ్యాపార శూన్య
స్థితిని, యౌవనవంతులకు ఉత్సవమును ఇచ్చునది
క్షపా = సర్వ
వ్యాపారముల్లను క్షయింపజేయునది
విభావరీ = సూర్యకాంతిని
కప్పునది, చంద్రాదులచే ప్రకాశించునది
తమస్వినీ = చీకటి కలిగినది
రజనీ = దీని యందు కాముకులు
రాగయుక్తులగుదురు
యామినీ = యామములు కలిగినది
తమీ = దీనియందు విరహవంతులు
గ్లానిని పొందుదురు
ఇవి పన్నెండును రాత్రికి
పేర్లు
తమిస్రా తామసీ రాత్రిః
తామసీ = అధికమైన తమస్సు
గలది
ఇది కటిక చీకటి పేరు
జౌత్స్నీ చన్ద్రికయాన్వితా
జౌత్స్నీ = వెన్నెలతో
కూడినది
ఇది వెన్నెల రాత్రి పేరు
ఆగామి వర్తమానా
హర్యుక్తాయాం నిశి పక్షిణీ
జరుగుచుండెడి పగలు తోడను
రాగల పగటితో కూడిన రాత్రిని పక్షిణి అందురు
ఇది రెండు పగళ్ళ మధ్య గల
రాత్రి పేరు
గణరాత్రాం నిశా బహ్వ్య
గణరాత్రః = అనేక రాత్రుల
సమూహము
ప్రదోషో రజనీముఖం
ప్రదోషః = దోష యనగా రాత్రి,
దాని యొక్క ప్రారంభము ప్రదోషము
రజనీ ముఖం = రాత్రి యొక్క
ఆరంభము
ఇవి రెండును రాత్రి మొదలుకు
గల పేర్లు
అర్థరాత్ర నిశీథౌ ద్వౌ
అర్ధరాత్రః = రాత్రి యొక్క
సగము
నిశీదః = దీనియందు నియతముగా
నిద్రింతురు
ఇవి రెండును నడిరేయి పేర్లు
ద్వౌ యామ ప్రహరౌ సమౌ
యామః = స్థాయి కానిది
ప్రహారః = దీనియందు ఢక్కాది
వాద్యములు వాయింపబడును
ఇవి రెండును జాము పేర్లు
స పర్వ సందిః ప్రతిపత్పంచ
దశ్యోర్యదన్తరం
పర్వ సంధిః = పాడ్యమి మరియు
అమావాస్య, పౌర్ణమిల మధ్య కాలము పర్వమనబడును, అభిలషితములను పండించునది లేక
పాలించునది, పూర్వ కాలమును ఉత్తర కాలము తోడ సంధింపబడును కనుక సంధి
పక్షాన్తౌ పంచదశ్యౌ ద్వే
పక్షాన్తౌ = శుక్ల కృష్ణ
పక్షముల తుదలు.
పంచ దశ్యౌ = పంచ దశ తిథులను
నిండించునవి
ఈ రెండును పౌర్ణిమా
అమావాస్యలకు పేర్లు
పౌర్ణమాసీ తు పూర్ణిమా
పౌర్ణమాసీ = చంద్రుడు ఈ
రోజు పూర్ణుడుగా తోచును, ఇతని చేత తిథి లెక్క పెట్ట బడును కనుక పౌర్ణమాసీ, మాసము
ఇందు పూర్ణమగును
పూర్ణిమా = చంద్రుడు నిండుట చేత నిర్వృతమైనది , అఖండ
చంద్రుడు కలిగినది
ఇవి రెండును పున్నమి పేర్లు
కళాహీనే సానుమతిః
చంద్రుడు కళాహీనుడైనపుడు ఆ
పున్నమి అనుమతి యనంబడును. అనగా చతుర్దశితో కూడినదని భావము. అందువలన ఇది ఒక కళ
తక్కువగా వున్నా చంద్రునితో కూడిన పున్నమ.
పూర్ణే రాకా నిశాకరే
చంద్రుడు పూర్ణుడై
యున్నపుడు ఆ పున్నమి రాక యనబడును అనగా చతుర్దశి వేధ లేనిది. దీనియందు దేవతలు పితృ
సమేతులై సేవ కొరకు తలప బడుదురు. రాకా యనగా సుఖము నిచ్చునది.
ఇది అన్ని కళలతో కూడిన
చంద్రుడు కలది.
అమావాశ్యా త్వమావశ్యా దర్శ
సూర్యేన్దుసంగమః
అమావాస్యా, అమావస్యా = దీని
యందు సూర్య చంద్రులు కూడుకొని యుందురు
దర్శః = దీనియందు
సూర్యచంద్రులు కూడుకొని అగుపడుడురు
సంగమః = దీనియందు
సూర్యచంద్రులకు సంగమము కలుగును
ఇవి నాలుగును అమావాస్య
పేర్లు
సా దృష్టేన్ధు స్సినీవాలీ
అ యనగా విష్ణువు సా యనగా
ఆయనతో కూడినది అనగా లక్ష్మి . సిని యనగా ఆ లక్ష్మి ఇందు కలదు. ఆ చంద్రకళ ఇందు
లేతయై యుండును.
ఇది చంద్రకళతో కూడిన
అమావాస్య పేరు.
సా నష్టేన్దుకళా కుహూః
కుహూః = తమస్సు చేత
ఆశ్చర్యము కలుగజేయునది.
ఇది చంద్ర కానరాని అమావాస్య
పేరు
ఉపరాగో గ్రహః
ఉపరాగః = సూర్యచంద్రులు
దీనిచేత రాగము పొందింపబడుదురు
గ్రహః = దీని చేత
సూర్యచంద్రులు గ్రహింపబడుదురు
ఇవి రెండును గ్రహణము పేర్లు
రాహుగ్రస్తే త్విన్దౌ చ
పూష్ణిచ
సోపప్లవోవ రక్తౌ ద్వౌ
సోపప్లవః = ఉపప్లవముతో
కూడినవాడు
ఉపరక్తః = వ్యాపారము వలన
ఉపరక్తుడైనవాడు, రాహువు చేత తమోయుక్తుడిగా చేయబడ్డవాడు
ఈ రెండును
రాహుగ్రస్తులైన సూర్య చంద్రుల పేర్లు
అగ్న్యుత్పాత ఉపాహితః
ఉత్పాతమనగా స్వస్వభావము
విడచి వికారము పొందుట. అగ్ని యొక్క ఉత్పాతము అగ్న్యుత్పాతము
ఉపాహితః = అనిష్టము దీని
కాసన్నమైయుండును,
ఇవి రెండును ఆకసమునండున్న
అగ్ని వికారముల పేర్లు
ఏకయోక్త్యా పుష్పవంతౌ
దివాకర నిశాకరౌ
ఒక మాట చేత సూర్య
చంద్రులిద్దరును పుష్పవంతులనబడుదురు. పుష్పమనగా వికాసము – అది గలవారు పుష్పవంతులు.
ఈ పుష్పదంత అన్నది సూర్యచంద్రులిద్దరిక్ యున్న పేరు
అష్టాదశ నిమేషాత్తు కాష్టా
పదునెనిమిది రెప్పపాట్ల
కాలమును కాష్ట యందురు, ఇంకొక అర్ధము ప్రకాశించునది యని
ఇది పద్దెనిమిది నిమేషముల
కాలము – కాష్ట
త్రింశత్తు కలాః
30 కాష్టల కాలము కల
యనబడును.
తాస్తు త్రింశ త్క్షణః
30 కలలు గల కాలము
క్షణమనబడును , ఇంకొక అర్ధము హింసించునది యని.
తే తు ముహూర్తో
ద్వాదశాస్త్రియాం
12 క్షణముల కాలమును
ముహూర్తమందురు.
ముహూర్తః = శుభాశుభ దర్శనము
వలన కుటిలమగునట్టిది, పలుమారులు పోవుచుండినట్టిది.
రెండు ఘడియల కాలము 1
ముహూర్తము.
తే తు త్రింశ దహోరాత్రః
30 ముహూర్తముల కాలము
అహోరాత్రమనబడును. అహోరాత్రమనగా రాత్రితో కూడిన పగలు అని అర్ధము
పక్షస్తే్ దశ పఞ్చ చ
15 అహోరాత్రముల కాలము
పక్షమనబడును. పక్షమనగా భూతములను పరిపాకమునొందించునది.
పక్షః = పరిగ్రహింపబడునది.
పక్షౌ పూర్వా పరౌ శుక్ల
కృష్ణా
ఇందు పూర్వ పక్షము శుక్ల
పక్షమని, అపరపక్షము కృష్ణ పక్షమని చెప్పబడును.
మాసన్తు తావుభౌ
రెండు పక్షములు కూడిన
కాలమును మాసమండురు.
మాసః = దీనిచేత కాలము
పరిమాణము చేయబడును
______________________________________________________________________
ద్వౌ ద్వౌ మాఘాది మాసౌ స్యా
దృతుః
ద్వౌ ద్వౌ = రెండేసి
మాఘాది రెండేసి నెలలు
ఋతువని పిలచెదరు.
ఋతౌః = గతించునది
తైరయనం త్రిభిః
మూడు ఋతువుల కాలము
ఆయనమనబడును
ఆయనః = దీని వెంట సూర్యుడు
పోవును.
ఆయనే ద్వే గతి
రుదగ్దక్షిణార్కస్య
మాఘము నుంచి ఆషాఢము వరకు సూర్యుడు
ఉత్తరరా దిక్కుగా పోవును అందువలన ఉత్తరాయణమనబడును. శ్రావణము నుంచి పౌష్య మాసము వరకు దక్షణ దిశగా
కదలును కనుక అది దక్షిణాయానము.
వత్సరః
ఉత్తరాయణము, దక్షిణాయానము
రెండును కలిసి ఒక సంవత్సరమగును
సమ రాత్రిం దివే కాలే
విషువం ద్విషువం చ తత్
అహోరాత్రములు రెండును
సమానమైన కాలము విషువత్ విషువమనబడును
పుష్య యుక్తా పౌర్ణమాసీ
పౌషీ మాసే తు యత్ర సా
నామ్నా స పౌషో
మాఘాద్యాశ్చైవ మేకాదశాపరే
పుష్య నక్షత్రముతో కూడిన
పున్నమ పోషి యనబడును. ఆ పున్నమ ఏ మాసమున నుండునో ఆ మాసము పౌశామనబడును. ఇతర మాఘాది
మాసములు పదకొండున్ను ఇట్లే తెలియనగును.
మార్గశీర్షే సహా మార్గ
అగ్రహాయణి కశ్చ స
మృగశీర్ష నక్షత్రముతో కూడిన
పున్నమ గలిగిన మాసము మార్గశిరము.
సహాః = దీనియందు ప్రజలు
మంచును సహింతుర, దీనియందు ప్రాణులు శక్తియుక్తులగుదురు.
(దక్షిణాయనము నందు వర్ష
ఋతువు కంటే శరదృతువు అంత కన్నాహేమంతమునందు ప్రాణులకు బలము వృద్ది పొందుదురని వైద్య
శాస్త్రమునందున్నది)
మార్గీ = మృగశీర్శమే మృగము
దానితో కూడిన పున్నమ కలిగిన మాసము మార్గి.
ఆగ్రహాయణి = మృగశీర్శమే ఆగ్రహాయణి, దీనితో కూడిన పున్నమ
కలిగిన మాసము
ఇవి నాలుగును మార్గశీర్షము
పేర్లు
పౌషే తైష సాహసయా ద్వౌ
పుష్య నక్షత్రముతో కూడిన
పున్నమ ఇందు కలదు.
తిష్యః = పుష్యమే తిష్యము,
ఆ నక్షత్రము కలిగిన పున్నమి ఇందు గలదు.
సహస్యః = సహమనగా బలము అది
దీనియందు గలదు.
ఇవి మూడును పుష్య మాసము
పేర్లు
తపా మాఘే
తపాః = దీనియందు
తపోయుక్తులగుడురు.
మాఘి = మఖా నక్షత్రముతో
కూడిన పున్నమి ఇందు కలదు.
ఈ రెండును మాఘ మాసము పేర్లు
అథ ఫాల్గుణే
స్యా త్తపస్యః ఫాల్గునికః
తపస్యః = తపస్సునందు
యోగ్యమైనది
ఫాల్గునః = ఉత్తర ఫల్గునీ
నక్షత్రముతో కూడిన పున్నమి ఇందు కలదు కావున ఫాల్గుణము
ఫాల్గునికః = ఫాల్గునికము
స్యా చ్చైత్రేచైత్రికో మధుః
చైత్రః , చైత్రికశ్చ =
చిత్రా నక్షత్రముతో కూడిన పున్నమి ఇందు కలదు
మధుః = దీని యందు మన్మధుడు
తలంపుకు వచ్చును, దీనియందు మకరందముండును
వైశాఖే మాధవో రాధో
వైశాఖీ = విశాఖా
నక్షత్రముతోకూడిన పున్నమి ఇందు కలదు
మాధవః = కుసుమ సంభృతమైన
మధువు ఇందు విస్తారముగా కలదు, మధువనగా వసంతుడు అతడు దీనియందు గలడు
రాధ = రాధ యనగా విశాఖ, ఆ
నక్షత్రముతోనున్న పున్నమి కలిగినది
జ్యేష్టే శుక్రః
జ్యేష్టః = జ్యేష్టా
నక్షత్రముతో కూడిన పున్నమితో కూడినది ఇందు కలదు
శుక్రః = దీని తాపము చేత
జనులకు దుఃఖము క్కలుగును
శుచి స్త్వయమ్
ఆషాఢే
శుచిః = తాపము వలననైన
దుఃఖము దీని వలన కలుగును
ఆషాఢః = ఆషాఢ నక్షత్రముతో
కూడిన పున్నమి దీనియందు గలదు
శ్రావణే తు స్యాన్నభాః
శ్రావణికశ్చ సః
శ్రావణః = శ్రావణా
నక్షత్రముతో కూడిన పిన్నామి దీని యందు గలదు, దీని యందు మేఘములు వర్షించుచున్నవి
నభాః = మేఘచ్చన్నమై
ప్రకాశించనిది
స్యు ర్నభాస్య పౌష్ఠపద
భాద్ర భాద్రపదా స్సమాః
నభస్యః = నభాస్సులనగా
మేఘములు, వాని యందు సమర్ధమై ఉండునది,
ప్రౌష్ఠపదాః = ప్రోష్ఠపద
నక్షత్రముతో కూడిన పున్నమి ఇందు గలదు.
భాద్రాః = భాద్రపద
నక్షత్రమే భాద్రము
భాద్రపద నక్షత్రముతో కూడిన
పున్నమి దీనియందు గలదు
స్యాదాశ్విన ఇషో ఽ ప్యా
శ్వయుజో ఽ పి
ఆశ్వినః = అశ్వినీ
నక్షత్రముతో కూడిన పున్నమి దీనియందు గలదు
ఇషుః = శత్రువుల జయించ
నిచ్చగించిన వారికి యాత్ర దీనియందు కలుగుచున్నది
ఆశ్వియుజః = అశ్వినీ
నక్షత్రమే అశ్వయుక్కు దీనితో కూడిన పున్నమి
దీనియందు కలదు
స్యాటు కార్తీకే
బాహులోర్జ్జౌ కార్తికికో
కార్తికః = కృత్తికా
నక్షత్రముతో కూడిన పున్నమి ఇందు కలదు
బాహులః = బహుళ యనగా కృత్తిక
అధికమైన అర్థములనిచ్చునది
ఊర్జః = శత్రువుపై
జయము కోరువారికి ఉత్సాహముకలిగించునది
హేమంతః
అనగా చలి చేత జనులను హింసించునది,
మార్గశిర పౌష్య మాసంములతో కూడిన ఋతువు పేరు
శిశిరో ఽ స్త్రియాం
శిశిరః = శీతము చేత దేహమును
అల్పముగా చేయునది, శీతము చేత ప్రయోజనములు స్వల్పముగా చేయునది
వసన్తే పుష్పసమయ స్సురభిః
వసంతః = దీనియందు మన్మధుడు
నివసించును, దీనియందు జనులు సుఖముగా నుందురు
పుష్ప సమయః = ఇది పుష్పములు పూచెడి కాలము
సురభిః = దీని యందు జనులు
లెస్సగా సంతోషింతురు, దీనియందు జనులు శుభకార్యములు చేయుదురు
ఇవి మూడును చైత్ర
వైశాఖములతో కూడిన ఋతువు పేరు
గ్రీష్మ ఊష్మకః
నిధాఘ ఉష్ణోపగమ ఉష్ణ
ఊష్మాగమ స్తవః
గ్రీష్మః = జలమును
గ్రసించునది, ఊష్మకః = దుఃఖ పెట్టునది
నిధాఘః = దీనియందు జనులు
మిక్కిలి దహించబడుదురు
ఉష్ణోపగమః = దేనొఇ యందు
ఉష్ణమునకు ప్రాప్తి కలదు
ఉష్ణః = దహించునది
ఊష్మణః = దీనియందు ఊష్మము
యొక్క రాక గలదు
తపః = తపింపజేయునది
ఇవి ఆరును జ్యేష్ఠ ఆషాఢ
మాసములతో కూడిన ఋతువు పేరు
స్త్రియాం ప్రావృట్
స్త్రియాం భూమి వర్షాః’
ప్రావృట్ = మేఘములు
మిక్కిలిగా దీనియందు వర్షించును
వర్షాః = నిత్య బహువచనము,
వర్షము కలిగినది
ఇవి శ్రావణ భాద్రపద
మాసములతో కూడిన ఋతువు పేర్లు
అథ శరత్ స్త్రియాం
శరత్ = అడుసును పోగొట్టునది
ఇది ఆశ్వయుజ కార్తీక
మాసములతో కూడిన ఋతువు పేరు
షడమీ ఋతవః పుంసి
మార్గాదీనాం యుగైః క్రమాత్
మార్గశీర్షాది
పర్యంతం రెండేసి మాసములు వరుసగా హేమంతాది ఋతువులగును
సంవత్సరో వత్సరో ఽ బ్దో
హాయనో ఽ స్త్రీ శరత్సమాః
సంవత్సర, వత్సర = ఋతువులు
దీని యందు వశించును కావున సంవత్సరము, వత్సరమున్ను
అబ్దః = అధిక మాసముచే
వ్యాపింపబడునది, జలమునిచ్చునది
హాయనః = వరుసగా ఋతువులను
విడచునది
శరత్ = జగత్తు దీనిచేత
దుఃఖము పొందును, ప్రాణుల వయసు దీనిచే జీర్ణమగుచున్నది
శరచ్చబ్దము ఋతుపర్యాయమందు
స్త్రీలింగమగుటచే ఇచ్చటనూ స్త్రీ లింగము
సమాః = జనులను విహ్వలత్వము
నొందించునది
ఇవి ఆరును సంవత్సరము పేర్లు
మాసేన స్యా దాహోరాత్రః
పైత్రో
ఆహోరాత్రః స్యాత్ = మనుష్యుల
ఒక మాసము పితరులకు ఒక అహోరాత్రము. అందు శుక్ల పక్షము ప్పగాలు, కృష్ణ పక్షము రాత్రి
పైత్రః = పితృసంబంధమైన
అహోరాత్రము
వర్షేణ దైవతః
దైవతః = మనుష్యుల ఒక
సంవత్సరము దేవతలకు ఒక అహోరాత్రము. అందు ఉత్తరాయణము పగలు, దక్షిణాయనము రాత్రి.
దివై ర్వర్ష
సహస్రైర్ద్వాదశభి ర్దైవతమ్ యుగం
మనుష్యుల యొక్క 360
సంవత్సరములు దేవతలకు ఒక సంవత్సరము, అట్టి 12000 సంవత్సరములు దేవతలకు ఒక యుగము.
దైవే యుగసహస్రే ద్వే
బ్రాహ్మః
ఇట్టి దైవ యుగములు 2000
బ్రహ్మకు ఒక అహోరాత్రము. అది బ్రాహ్మమనబడును.
బ్రాహ్మః = బ్రహ్మ సంబంధమైన
అహోరాత్రం, అందు బ్రహ్మ అహస్సు ఉదయ కాలము, బ్రహ్మ రాత్రి క్షయ కాలము
కల్పౌ తు తౌ నృణాం
అట్టి బ్రహ్మ యొక్క
అహోరాత్రము మనుష్యులకు 2 కల్పములు.
కల్పౌః = నరులకు ఉత్పత్తి
నాశములను చేయునది
కృత, త్రేతా, ద్వాపర, కలి యుగములు
వేయిమారులైన ఒక కల్పము
అందు కృత యుగము మనుష్యుల
మాసము చేత ౧౭ లక్షల ౨౮ వేల సంవత్సరములు (17,28,000 సంవత్సరములు)
త్రేతా యుగమునకు ౧౨ లక్షల
౯౬ వేల సంవత్సరములు (12, 96,000 సంవత్సరములు)
ద్వాపర యుగమునకు ౮ లక్షల ౬౪
వేల సంవత్సరములు (8, 64, 000 సంవత్సరములు)
కలి యుగమునకు ౪ లక్షల ౩౨
వేల సంవత్సరములు (4, 32, 000 సంవత్సరములు)
కల్పమనగా బ్రహ్మ యొక్క ఒక
దినము
మన్వంతరంతు దివ్యానాం
యుగానామేక సప్తతిః
ముందు చెప్పిన దేవ యుగములు
౭౧ (71) అయిన ఒక మన్వంతరము అనగా మరియొక మనువు వచ్చునది ఒక మన్వంతరము, మనువు యొక్క
ఒక అంతరము.
సంవర్తః ప్రళయః కల్పః క్షయః
కల్పాంత ఇత్యపి
సంవర్తః = దీనియందు జగత్తు
ఉపరతమగును
ప్రళయః = దీనియందు జగత్తు
విలయమగును
కల్పః = లోక నాశము కొరకు
సమర్ధమైనది
క్షయః = దీని యందు జగత్తు
క్షయించును
కల్పాన్తః = కల్పము యొక్క
అంతము
ఇవి అయిదున్ను ప్రళయము
యొక్క పేర్లు
________________________________________________________________
అస్త్రీ పఙ్కం పుమా
న్పాప్మా పాప కిల్బిష కల్మషం
కలుషం వృజినైనో ఽ ఘ మంహో
దురిత దుష్కృతం
పంకం = సంబంధము వలన
విస్తారము నొందునది
పాప్మా = దీని వలన నరకమున
బడుదురు
పాపం = దీనివలన జనము తన్ను
రక్షించకొనును, పాపిష్టుని గ్రసించునది
కిల్బిషం = నరకము నందు
ద్రోయునది
కల్మషం = చిత్రగుప్తాదులచే
లెక్కించబడునది, శుభ కర్మలనల్పముగా జేయునది
వృజినం = శిష్టులచేత
వర్జించబడునది, దీని చేత నరకమును బొండుదురు
అఘం = ధన్యుని జేరుపరానిది,
కర్తను పొందునది, దుఖమును విడువనిది
అంహః = దీనిచేత జనులు
నరకమును బొండుదురు
దురితం = నిన్దితమైన నడత
కలిగినది
దుష్కృతం = నిన్దితమైన
కార్యము గలది
ఇవి పన్నెండును పాపముల
పేర్లు
స్యా ద్ధర్మ మస్త్రియాం
పుణ్యం శ్రేయసీ సుకృతం వృషః
ధర్మః = విశ్వమును
ధరించునది
ఈ ధర్మశబ్దము వేదమున నపుంసక లింగము, లోకమున పుంలింగము
పుణ్యం = శుభమును జేయునది
శ్రేయః = మిక్కిలి
ప్రశంశించబడునది, సేవింప బడునది
సుకృతం = లెస్సగా
జేయబడునది, శుభమైన కర్మ గలది
వృషః = అభ్జిలశామును
వర్షించునది
ఇవి ఐదున్ను పుణ్యముల
పేర్లు
ముత్ప్రీతిః ప్రమదో హర్ష
ప్రమో దామోద సంమదా
ముత్ = సంతోషింప జేయునది
ప్రీతి = తృప్తి చేయునది
ప్రమధః = అధికమైన సంతోషము
హర్షః = సంతోషించుట
ప్రమోదః = అతిశయమైన సంతోషము
ఆమోదః = అంతటను మోదము
సంమదః = మంచి సంతోషము
ఆనన్దధుః, ఆనన్దః = ఆనందింపజేయునది
శర్మః = అశుభమును చెరచునది
శాతః = దుఖమును పోగొట్టునది
సుఖం = అశుభమును
పోగొట్టునది, ఇంద్రియముల నాప్యాయనము జేయునది
ఇవి పన్నెండును సంతోషము
పేర్లు
శ్వశ్శ్రేయసం శివం భద్రం
కల్యాణం మంగళం శుభం
భావుకం భవికం భవ్యం కుశలం
క్షేమ మస్త్రియాం
శస్తం చ
శ్రేయసం = రాగల శ్రేయస్సు
దీని యందు గలదు, మంచి శ్రేయస్సు
శివం = అరిష్టమును
స్వల్పముగా చేయునది
కళ్యాణం = కళ్యాణమైనది,
సుఖమును పొందించునది
మంగళం = సుఖమునిచ్చునది,
ధన్యుని పొందునది
శుభం = ఒప్పునది
భావుకం = ధన్యులయందు
గలుగుటఏ స్వభావముగా గలిగినది
భవికం = కోరిక కలుగుట
యన్నది దీనివలన కల్గును
భవ్యం = పుట్టుట కర్హమైనది
కుశలం = కుత్సితమును
నల్పముగా చేయునది, మంచి వారియందు కూడుకొనియుండునది
క్షేమం = అశుభమును
పోగొట్టునది
శస్తం = స్తోత్రము
చేయబడునది.
ఇవి పన్నెండును
శుభముల పేర్లు
అథ త్రిషు ద్రవ్యే పాపం
పుణ్యం సుఖాని చ
పాప పుణ్య శబ్దములు
రెండును, సుఖ శబ్దము మొదలైన 13 శబ్దములు గుణ వాచకములైనప్పుడు రూపభేదములచేత ముందు
చెప్పబడిన లింగములయందు వర్తించును. ద్రవ్య వాచకములైనప్పుడు మూడు లింగములయందు
వర్తించును
మకల్లి కా మాచర్చితా
ప్రకాణ్డముద్ఘతల్లజౌ
ప్రశస్త వాచకా న్యమూని –
మతల్లికాది శబ్దములు
5శ్రేష్ట వాచకములును, అఖండ పదములును, శస్త పర్యాయ శబ్దములు, కేవల మంగళార్థములు,
గుణ గుణి వాచకములును అగును. (అశ్వ తల్లికా = శ్రేష్ఠమైన గుఱ్ఱము, బ్రాహ్మణ మర్చికా
= శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు ఇటువంటివి) ఈ మతల్లికా, మాచర్చికా, ప్రకాణ్డ, ముద్ఘ,
తల్లజ అయిదున్ను ప్రశస్తమైన వాటి పేర్లు.
ఆయ శ్శుభావహో విధిః
అయః = పుణ్య పురుషుని
పొందునది
ఇది మంగళ కార్యము పేరు
దైవం దిష్టం భాగదేయం భాగ్యం
స్త్రీ నియతి ర్విధిః
దైవం = పరమేశ్వరుని యందు
పుట్టినది
దిష్టం = శుభా శుభ
ఫలములనిచ్చునది
భాగదేయం = ఐశ్వర్య
సంబంధమైనది
భాగ్యం = సేవింప దగినది
నియతిః = దీనిచేత
నియమింపబడును
విధిః = దీనిచేత
విధింపబడును
ఈ ఆరును పూర్వజన్మార్జితమైన
శుభాశుభకర్మ పేర్లు
హేతు ర్నా కారణం బీజం
హేతుః = పరిపాకము చేత
కార్యరూపమునొందునది, వృద్ధి పొందునది
కారణం = చేయునది
బీజం = విశేషముగా నగునది
ఈ మూడును కారణము పేర్లు
నిదానం త్వాదికారణం
నిదానం = దీనిచేత కార్యము
పుట్టించబడును
కారణం = ఆరంభ కాలమునందు
కారణమైనది
(ఇది వైశేషిక మతమున సమవాయి
కారణమనబడును, బౌద్ధ మతమున ఉపాదాన కారణమనబడును, వైద్య మతమున కారణ కారణమనబడును –
ఎట్లాగ అంటే కంపము లేదా వణుకుకు జ్వరము కారణము, జ్వరమునకు శ్లేష్మము కారణము కనుక
శ్లేష్మమే వణుకుకు కారణమనుట)
ఈ రెండును ముఖ్య కారణము
పేర్లు
క్షేత్రజ్ఞ ఆత్మా పురుషః
క్షేత్రజ్ఞః = నశ్వరమైన ఈ
శరీరమునెరిగిన వాడు
ఆత్మాః = సంసారమందే ఎప్పుడు
చరించు వాడు, స్వకర్మ ఫలమును భుజించువాడు
పురుషః =పురమనగా శరీరము,
అందుండువాడు పురుషుడు
ఈ మూడును ఆత్మ పేర్లు
ప్రధానం ప్రకృతి స్త్రియాం
ప్రధానం = అన్నియు దీని చేత
వ్యక్తముగా చేయబడును
ప్రకృతిః = దీని చేత
జగత్ప్రారంభం చేయబడుచున్నది, పురుషోపభోగము కొరకు శబ్ద స్పర్శాది భోగ్య వస్తువులను
జేయునది
ఇవి రెండును మాయ పేర్లు
విశేషః కాలికో వస్థా –
వస్తువులయొక్క కాలకృతమైన
యౌవనాది రూపవిశేషములు అవస్థయనబడును. ఇది శరీరమునండుండును
ఇది కాలావస్థ పేరు
గుణా స్సత్వం రజస్తమః
ప్రకృతి యొక్క గుణములు సత్వ
రాజస్తమంబులనబడును.
యదార్ధముగా నేరుగాబడునది
సత్వము, అది జ్ఞాన హేతువు
రాగయుక్తుల జేయు గుణము
రజస్సు, ఇది దుఃఖ హేతువు
గ్లాని పొందించు గుణము
తమస్సు, ఇది మోహ హేతువు
జను ర్జనన జన్మాని జని
రుత్పత్తి రుద్భవః
జనువు, జననము, జన్మము, జని
ఇవి యన్నియు జనియంచుటయే.
ఉత్పత్తిః = పుట్టుట
ఉద్భవః = ఉద్భవించుట
ఇవి ఆరును పుట్టువు పేర్లు
ప్రాణీ తు చేతనో జన్మీ జంతు
జన్యు శరీరిణః
ప్రాణీ = ప్రాణము కల్గినది
చేతనః =ఎరుగునది
జన్మీ = జన్మము కలిగినది
జన్తుః = పుట్టునది
శరీరీ = శరీరము కలిగినది
ఈ ఐదున్ను జంతువుల పేర్లు
జాతి ర్జాతం చ సామాన్యం
జాతిః , జాతం =
ప్రాదుర్భవించినది
సామాన్యం = సమానమైన
పదార్దముల యొక్క భావము
ఇవి మూడును ఘటత్వాది జాతి
పేర్లు
వ్యక్తిస్తు పృథగాత్మతా
వ్యక్తిః = జాతికి వేరై ఆ
జాతికి ఆశ్రయమైనది వ్యక్తి యనబడును,
వ్యక్తమగునది
చిత్తంతు చేతో హృదయం
స్వాంతం హృన్మానసం మనః
చిత్తం, చేతశ్చ = తెలియజేయునది
హృదయం, హృత్ = విషయాదులచేత హరించబడునది
స్వాంతం = పలుకునది,
మానసం, మనః = దీని చేత
ఎరుగబడును.
ఈ ఏడును మనస్సు పేర్లు
No comments:
Post a Comment