Sunday, January 17, 2016

అమరకోశం వ్యోమవర్గం

అమరకోశము  వ్యోమవర్గము

వ్యోమ వర్గము

ద్యౌ దివౌ ద్వేస్త్రియా మభ్రం వ్యోమ పుష్కర మంబరం
నభో  ఽ న్తరిక్షం గగన మనంతం సుర వర్త్మఖం
వియద్విష్ణు పదం వా తు పుం స్యాకాశ విహాయసీ
(విహాయసో ఽ పినాకో ఽ ఫై ద్యురపి స్యాత్త దవ్యయం
తారాపథ శ్శబ్దగుణో మేఘద్వారం మహాబిలమ్)

ద్యౌ = దివ్యమైనది, ప్రకాశించునది
అభ్రం = అమూర్తమైనందున చలింపనిది, అమూర్తమైనందున ప్రకాశింపనిది
వ్యోమ = విశ్వమున వ్యాపించునది, విశేషముగా అవకాశమిచ్చి రక్షించునది
పుష్కరం = అవకాశమును పోషించునది, ఉదకమును ఇచ్చునది
అంబరం = శబ్ద గుణకమగుటచే మ్రోయుచుండినట్టిది
నభః = మేఘముల యునికి వలన ప్రకాశించనిది
అంతరిక్షం = దీనియందు జగత్తంతయు చూడబడును, దీనియందు నక్షత్రములు గలవు
గగనము = దీని మార్గమున దేవతలు పోవుదురు, పక్షి జాతి ఇందు సంచరించును
అనంతం = అంతము లేనిది
సుర వర్త్మ = ఇది సురల యొక్క మార్గము
ఖం = రూపము లేనిది గనుక బుద్ది చేత తెలియగూడనిది
వియత్ = ఎడతెగక యుండునది
విష్ణు పదం = విష్ణువుకు స్థానం
ఆకాశం = దీని యంతటను సూర్యాదులు ప్రకాశింతురు, అంతటా ప్రకాశించునది
విహాయః = దీని యందు విశేషముగా అన్నియు సంచరించును, సర్వము దీనిని పొందును
ఈ పదహారున్ను ఆకాశము పేర్లు

వ్యోమ వర్గము సమాప్తము  తరువాత దిగ్వర్గము

No comments:

Post a Comment